పాట్నా: బీహార్లో రెండు చోట్ల హింసాత్మక సంఘటనలు జరిగాయి. గ్రామస్తులు రాళ్ల దాడులకు పాల్పడ్డారు. (Mob Violence In Bihar) ఈ సంఘటనల్లో పలువురు పోలీసులు గాయపడ్డారు. దీంతో ఆయా ప్రాంతాల్లో పోలీస్ బలగాలను మోహరించారు. ససారాం జిల్లాలోని సాగర్ ప్రాంతానికి చెందిన షాబాజ్ ఆలం మే13న అదృశ్యమయ్యాడు. మే 16న కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం రాత్రి దలేల్గంజ్ టౌన్ పోలీస్ స్టేషన్ పాత భవనం సమీపంలోని మురుగు కాలువలో షాబాజ్ మృతదేహం కనిపించింది. అతడు హత్యకు గురికావడంపై సాగర్ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొన్నది.
కాగా, సోమవారం ఉదయం ఆ ప్రాంతవాసులు ఆందోళన చేపట్టారు. పోలీసుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులపైకి రాళ్లురువ్వారు. ఈ హింసాత్మక సంఘటనలో దాల్మియా నగర్ ఎస్హెచ్వో సుశాంత్ కుమార్తో సహా పలువురు పోలీసులు గాయపడ్డారు. వారిని హాస్పిటల్కు తరలించి చికిత్స అందించారు. పరిస్థితిని అదుపు చేసేందుకు ఆ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో పోలీస్ బలగాలను మోహరించారు. రాళ్లదాడికి పాల్పడిన ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
మరో సంఘటనలో భాగల్పూర్ జిల్లాలోని పాసి తోలా గ్రామంలో అక్రమ మద్యం వ్యాపారం జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆదివారం రాత్రి వేళ పోలీస్ బృందాలు అక్కడకు చేరుకున్నాయి. మద్యం వ్యాపారి ఇంట్లో 20 లీటర్ల అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా ఒక గుంపు పోలీసులపైకి రాళ్లు విసిరింది. ఈ సంఘటనలో ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. దీంతో అదనపు పోలీస్ బలగాలను అక్కడకు రప్పించారు. మహిళలతో సహా పది మందిని అదుపులోకి తీసుకున్నారు.
VIDEO | Sasaram, Bihar: Tension flared in Sasaram, after the murder of a youth sparked violent protests. Locals clashed with police and pelted stones. Eight people were later arrested for attacking the police.
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/F5vHxpT5gx
— Press Trust of India (@PTI_News) May 19, 2025