న్యూఢిల్లీ : పంజాబ్ డిప్యూటీ సీఎం ఓపీ సోని కాన్వాయ్‌ను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గురువారం అడ్డుకుని ఘోరావ్ చేశారు. మోదీ జిందాబాద్, జై శ్రీరామ్ అంటూ బీజేపీ కార్యకర్తలు నినదించారు. సోని కాన్వాయ్‌ను కార్యకర్తలు అడ్డుకోవడంతో ముందుకు కదల్లేకపోయారు. దీంతో చేసేదేమీ లేక డిప్యూటీ సీఎం ఓపీ సోని.. మోదీ జిందాబాద్ అని నినదించారు. అనంతరం ఆయన కాన్వాయ్‌కు కార్యకర్తలు అడ్డుపడలేదు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
పంజాబ్‌లో తన కాన్వాయ్‌ను రైతులు అడ్డుకున్నారని ప్రధాని నరేంద్ర మోదీనే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం రోజు పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ కాన్వాయ్‌ను ఆందోళనకారులు అడ్డుకున్నారు. దీంతో సీఎం చరణ్‌జిత్ కారు దిగి ఆందోళనకారుల వద్దకు వెళ్లారు. మీ డిమాండ్లు ఏమిటి? అని వారిని ప్రశ్నించగా, రేపు మీతో చండీఘడ్‌లో సమావేశం అవుతామని ఆందోళనకారులు సీఎంకు సమాధానం ఇచ్చారు. మీ డిమాండ్లను వినేందుకు ఇప్పటికే తాను అంగీకరించాను. ఆందోళన ఎందుకు అని మళ్లీ సీఎం ప్రశ్నించారు. మీ డిమాండ్లను నెరవేర్చే బాధ్యత తనది అని సీఎం భరోసానిచ్చారు.
After yesterday's incident, BJP workers today surrounded Deputy Chief Minister OP Soni on the road and chanted 'Jai Shri Ram', later OP Soni raised 'Modi Zindabad' slogan and then the protesters let him go. pic.twitter.com/HQXEx4sJ09
— Gagandeep Singh (@Gagan4344) January 6, 2022