MLC Kavitha | భోపాల్ : పీడిత్ అధికార్ యాత్రను ప్రారంభించడానికి మధ్యప్రదేశ్లోని దతియాకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం మధ్యాహ్నం చేరుకున్నారు. దతియాలో ఎమ్మెల్సీ కవితకు ఓబీసీ ఫ్రంట్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మరికాసేపట్లో పీడిత్ అధికార్ యాత్రను కవిత ప్రారంభించనున్నారు.
ఓబీసీ ఫ్రంట్ వ్యవస్థానకుడు, ప్రముఖ బీసీ నాయకుడు దామోదర్ సింగ్ యాదవ్ చేపట్టబోయే ‘పీడిత్ అధికార్ యాత్ర’ను ఆ రాష్ట్రంలోని దాతియా పట్టణంలో ఎమ్మెల్సీ కవిత ప్రారంభిస్తారని రెండు రోజుల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఓబీసీ హక్కుల కోసం పోరాటం చేస్తున్న దామోదర్ సింగ్ యాదవ్కు మద్దతుగా కవిత అక్కడి ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనేక సంవత్సరాలుగా ఓబీసీల హక్కలు, డిమాండ్ల సాధన కోసం మధ్ప్రదేశ్ కేంద్రంలో దామోదర్ సింగ్ యాదవ్ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు.