Vinay Kulkarni | హత్య కేసులో యావజ్జీవ శిక్ష.. ఎమ్మెల్యే వినయ్ కులకర్ణిపై అనర్హత వేటు..!
Vinay Kulkarni | హత్య కేసులో దోషిగా నిర్ధారణ అయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే (Congress MLA) వినయ్ కులకర్ణి (Vinay Kulakarni) కి ఇటీవల కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరు (Bengalore) లోని ప్రజాప్రతినిధుల కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. దాంతో కర్ణాటక అసెంబ్లీ సెక్రెటరీ.. వినయ్ కులకర్ణిపై అనర్హత వేటువేశారు.
Vinay Kulkarni : హత్య కేసులో దోషిగా నిర్ధారణ అయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే (Congress MLA) వినయ్ కులకర్ణి (Vinay Kulakarni) కి ఇటీవల కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరు (Bengalore) లోని ప్రజాప్రతినిధుల కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. దాంతో కర్ణాటక అసెంబ్లీ సెక్రెటరీ.. వినయ్ కులకర్ణిపై అనర్హత వేటువేశారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. క్రిమినల్ కేసులో శిక్షపడినందుకు వినయ్ కులకర్ణి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. శిక్ష ఖరారైన ఏప్రిల్ 15 నుంచి ఆరేళ్లపాటు ఆయనపై అనర్హత వేటు అమల్లో ఉంటుందని తెలిపారు.
ఒకవేళ పైకోర్టు శిక్షపై స్టే విధించినా, లేదంటే శిక్షను రద్దుచేసినా అతనిపై ఆరేళ్ల తర్వాత నిషేధం తొలగిపోతుందని అసెంబ్లీ సెక్రెటరీ తన ప్రకటనలో స్పష్టంచేశారు. లేదంటే శిక్షాకాలం పూర్తయ్యేవరకు, ఆపైన ఆరేళ్లపాటు ఆయనపై అనర్హత వేటు కొనసాగుతుందని పేర్కొన్నారు. అంటే ఆయన శిక్ష పూర్తిచేసుకుని జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా ఆరేళ్లపాటు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అనర్హుడని కోర్టు స్పష్టం చేసింది.
కాగా ధార్వాడ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కర్ణాటక అసెంబ్లీ ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే వినయ్ కులకర్ణికి బీజేపీ నేత యోగేష్ గౌడ హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్షపడింది. యోగేష్ గౌడ 2016లో హత్యకు గురయ్యారు. ఈ హత్యకేసులో దోషులుగా తేలిన అందరికీ బెంగళూరులోని ప్రజాప్రతినిధుల కోర్టు ఏప్రిల్ 15న శిక్షలు ఖరారు చేసింది. వినయ్ కులకర్ణికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. దాంతో కర్ణాటక శాసనసభ ఆయనపై అనర్హత వేటు వేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

