ఇటావా: ఉత్తరప్రదేశ్లోని ఇటావాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే(BJP MLA) .. పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వందే భారత్ ఎక్స్ప్రైస్ రైలు ప్రారంభోత్సవ సమయంలో.. ఎమ్మెల్యే సరితా భదోరియా .. పచ్చజెండా ఊపబోయి.. రైల్వే ఫాట్ఫామ్ నుంచి పట్టాలపై పడిపోయారు. ఆగ్రా కంటోన్మెంట్ నుంచి బనారస్ వెళ్లే వందేభారత్ రైలుకు ఇటావా జంక్షన్లో పచ్చజెండా ఊపేందుకు ఎమ్మెల్యే వెళ్లారు. అయితే ఫాట్ఫామ్పై భారీ సంఖ్యలో జనం రావడంతో కిక్కిరిసిపోయింది. ఫాట్ఫామ్ చివర నిలుచున్న ఎమ్మెల్యే, ఆ తోపులాటలో పట్టాలపై పడిపోయారు. అక్కడ ఉన్న పార్టీ కార్యకర్తలు, భద్రతా సిబ్బంది ఆమెను తక్షణమే పట్టాల మీద నుంచి లేపారు. తిరిగి ఫాట్ఫామ్ మీద నిలుచున్న ఎమ్మెల్యే సరితా .. తన చేతుల్లో ఉన్న పచ్చజెండాను ఊపారు.
Watch this
Earlier in the evening at around 6:15 pm, Sarita Bhadauriya the MLA from Sadar Etawah fell on rail track during flag off ceremony of Agra Cantt-Banaras Vande Bharat express at Etawah Junction. 1/2 pic.twitter.com/PXAqXX3e7Q
— Arvind Chauhan 💮🛡️ (@Arv_Ind_Chauhan) September 16, 2024