ఐజ్వాల్: మిజోరం పోలీసులు రూ.350 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం, విశ్వసనీయ సమాచారం మేరకు ఈ నెల 1న ఐజ్వాల్ సమీపంలో తనిఖీలు నిర్వహించారు. ఓ పికప్ వ్యాన్‌లోని 128 సోప్ కేసుల్లో మాదక ద్రవ్యాలను దాచిపెట్టినట్లు గుర్తించారు.20 కేజీల క్రిస్టల్ మిథాంపటమైన్, 1.6 కేజీల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
వ్యాన్ డ్రైవర్ బీ లాల్థఝువాలా (45)ను అరెస్ట్ చేశారు. నార్కొటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోఫిక్ సబ్‌స్టాన్సెస్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.