(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, అక్టోబర్ 26(నమస్తే తెలంగాణ): బీజేపీ మిత్రపక్ష నాయకుడు, మిజోరం సీఎం జోరం తంగా ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. ప్రధానితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోమని, వేదిక పంచుకోనని ప్రకటించారు.
మణిపుర్ అల్లర్ల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో వందల చర్చిలు ధ్వంసమయ్యాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇదంతా చూస్తూ ఊరుకుందని, ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీతో ఎన్నికల సభలో పాల్గొనలేనన్నారు.