పాట్నా: బీహార్‌లో మిస్సైన బ్యాంకు ఉద్యోగి(Bank Employee) మృతదేహం ఓ బావిలో దొరికింది. నీళ్లు లేని బావిలో అతను పడ్డాడు. అతని స్కూటర్ కూడా ఆ బావిలోనే ఉంది. పాట్నాలోని బియుర్ ఏరియాలో ఈ ఘటన జరిగింది. అభిషేక్ వరుణ్ అనే వ్యక్తి ప్రైవేటు బ్యాంకులో ఉద్యోగం చేసేవాడు. అయితే జూలై 13వ తేదీన అతనను అదృశ్యం అయ్యాడు. కనిపించకుండాపోయిన రాత్రి తన కుటుంబంతో కలిసి వరుణ్ ఓ ఫంక్షన్‌కు హాజరయ్యాడు.
ఫంక్షన్ ముగిసిన తర్వాత ఇంట్లో వాళ్లను వెళ్లిపోమన్నాడు. అతను మాత్రం ఆ వేడుక వద్దే ఉన్నాడు. ఇక తెల్లవారుజామున 3 గంటల సమయంలో వరుణ్ భార్యకు ఫోన్ వచ్చిందని, తనకు యాక్సిడెంట్ అయినట్లు అతను చెప్పాడని ఎస్డీపీవో పుల్వారి సుశీల్ కుమార్ తెలిపారు. తన స్కూటర్ తనపై పడిందని, తన చుట్టూ గోడలు ఉన్నాయని భార్యకు అతను చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు.
ఆ తర్వాత ఫోన్ కాల్లో అతను చిక్కకుండాపోయాడు. అతని భార్య పోలీసులకు మిస్సైనట్లు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత ఉదయం పోలీసులు విచారణ మొదలుపెట్టారు. ఎందు వల్ల అతను మరణించి ఉంటాడో తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్‌కు పంపారు. కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు చెప్పారు.
పాట్నా కంకర్‌బాగ్‌లోని ఐసీఐసీఐ బ్యాంకులో వరుణ్ బ్రాంచ్ మేనేజర్‌గా చేస్తున్నట్లు తెలిసింది.