న్యూఢిల్లీ: తప్పుదోవ పట్టించే ప్రకటనలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. అవాస్తవ, అసహజ, అతిశయోక్తి విషయాలతో సమాజానికి తీవ్ర హాని కలిగించే తప్పుడు ప్రకటనలపై ఫిర్యాదు చేసేందుకు, వాటిని పరిష్కరించేందుకు తగిన యంత్రాంగాలను ఏర్పాటు చేయాలని రాష్ర్టాలను ఆదేశించింది. రెండు నెలల్లోగా ఆ వ్యవస్థను రూపొందించుకోవాలని స్పష్టంచేసింది.