బెంగాల్లోని హౌరాలో ఓ ల్యాబ్ టెక్నీషియన్ అత్యంత నీచానికి తెగబడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, 13 ఏళ్ల బాలిక ఓ దవాఖానలో నిమోనియాకు చికిత్స పొందుతున్నది. ఆమెను శనివారం రాత్రి సీటీ స్కాన్ కోసం తీసుకెళ్లగా ఆ ల్యాబ్ టెక్నీషియన్ ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
నిందితుడు ఈ దవాఖానలో కాంట్రాక్టుపై ఉద్యోగం చేస్తున్నాడు. బాలిక తల్లి ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.