భోపాల్: అంబులెన్స్‌లో ఒక బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. (Girl Gang Raped) డ్రైవర్, అతడి స్నేహితుడు ఆమెను కిడ్నాప్ చేశారు. కదులుతున్న అంబులెన్స్‌లో అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో ఆ ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్‌లోని మౌగంజ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లోని గర్భిణీలు, తల్లులు, అనారోగ్యంతో ఉన్న శిశువులను చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు జననీ ఎక్స్‌ప్రెస్ అంబులెన్స్‌లను అందుబాటులోకి తెచ్చారు. అయితే ఈ అంబులెన్స్‌కు చెందిన డ్రైవర్, అతడి స్నేహితుడు కలిసి 16 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేశారు. ఆమెను అంబులెన్స్‌లోకి బలవంతంగా ఎక్కించారు. కదులుతున్న ఆ వాహనంలో ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు.
కాగా, బాధిత బాలిక దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ బాలికపై లైంగిక దాడి జరిగినట్లు నిర్ధారణ జరిగింది. ఈ నేపథ్యంలో పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అంబులెన్స్ డ్రైవర్ వీరేంద్ర చతుర్వేది, అతడి స్నేహితుడు రాజేష్ కేవత్‌ను నిందితులుగా గుర్తించారు. బుధవారం రాత్రి వారిద్దరిని అరెస్టు చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.