న్యూఢిల్లీ: విమానాల్లో బాంబు పెట్టామంటూ బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడు హెచ్చరించారు. నిందితులను ‘నో ఫ్లై’ జాబితాలో చేరుస్తామన్నారు. ఢిల్లీలో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ఈ హెచ్చరికలు జారీచేశారు. బాంబు బెదిరింపు వరుస ఘటనలపై స్పందించిన మంత్రి.. ఇది చాలా సున్నితమైన అంశమని పేర్కొన్నారు. బెదిరింపుకాల్స్కు పాల్పడేవారికి జీవితఖైదు విధించేలా చట్టపరమైన మార్పులు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.