భోపాల్: మధ్యప్రదేశ్ మంత్రి, సీనియర్ బీజేపీ నేత కైలాశ్ విజయవర్గీయ తాజ్ మహల్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సాగర్ జిల్లాలోని బీనాలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, మొఘల్ రాజు షాజహాన్ సతీమణి ముంతాజ్ మహల్‌ను మొదట బుర్హాన్పూర్లో ఖననం చేశారని, ఆ తర్వాత నిర్మాణంలో ఉన్న ఓ దేవాలయం వద్దకు ఆమె మృతదేహాన్ని తీసుకొచ్చారని, అక్కడ తాజ్ మహల్‌ను నిర్మించారని చెప్పారు. ఇది రెచ్చగొట్టే చర్య, తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు అని పలువురు మండిపడుతున్నారు.