జైపూర్: ఐఏఎఫ్ మిగ్-29 యుద్ధ విమానం సోమవారం రాజస్థాన్‌లోని బామర్లో కూలిపోయింది. కూలిపోవడానికి ముందే పైలట్ సురక్షితంగా బయటపడగలిగారు. బామర్ సెక్టార్‌లోని ఐఏఎఫ్ బేస్ నుంచి శిక్షణ కోసం బయల్దేరిన ఈ విమానంలో సాంకేతిక లోపం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. ఉత్తర్లాయ్ ప్రాంతంలో కూలిన వెంటనే మంటల్లో చిక్కుకున్నట్లు చెప్పారు. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు.
న్యూఢిల్లీ: వ్యవసాయ, అనుబంధ రంగాల అభివృద్ధి కోసం ఏడు కొత్త కార్యక్రమాలను అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దాదాపు రూ.14 వేల కోట్లతో ఈ కార్యక్రమాలను అమలు చేయనుంది. ఇందు లో డిజిటల్ వ్యవసాయ మిషన్‌కు రూ.2,817 కోట్లు, క్రాప్ సైన్స్‌కు రూ.3, 979 కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. ముంబై-ఇండోర్ మధ్య రూ.18, 036 కోట్లతో 309 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. గుజరాత్‌లోని సనంద్‌లో రూ.3,307లో సెమికండక్టర్ల తయారీ యూనిట్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది.