Windows 7 | మైక్రోసాఫ్ట్ మార్కెట్లోకి విండోస్ 11, 10 వెర్షన్లను కొత్త ఫీచర్లతో తీసుకొచ్చినప్పటికీ, భారత్‌లో చాలామంది విండోస్ 7, విండోస్ 8, 8.1 వెర్షన్లనే ఎక్కువగా వాడుతున్నారు. మైక్రోసాఫ్ట్ గణాంకాల ప్రకారం విండోస్ 11, 10 వెర్షన్లను వాడే వినియోగదారుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తున్నప్పటికీ అవన్నీ లైసెన్స్డ్ వెర్షన్లుగా గమనించాల్సి ఉంటుంది.
నిజానికి ప్రతి పదిమంది యూజర్లలో ఒకరు లైసెన్స్డ్ వెర్షన్‌ను వాడుతుంటే, మిగతావారు అన్లైసెన్స్డ్ వెర్షన్‌నే వాడుతున్నారు. అందులోనూ అత్యధికులు విండోస్ 7, 8, 8.1 అన్లైసెన్స్డ్ వెర్షన్లనే వినియోగిస్తున్నారు. ఈ వెర్షన్లలో ‘క్రౌడ్‌స్ట్రైక్’ తాజా సెక్యూరిటీ అప్డేట్ సపోర్ట్ చేయదు. అదే ఇప్పుడు మంచిదైంది.