Microplastics | అంకారా, ఆగస్టు 23: మానవ శరీరాన్ని ప్లాస్టిక్ ఆక్రమించేస్తున్నదని, ఆఖరికి మెదడు కణజాలంలోకి కూడా మైక్రోప్లాస్టిక్ చేరిందని పరిశోధకులు గుర్తించారు. మృతదేహాల నుంచి మెదడు, కాలేయం, మూత్రపిండాల నమూనాలను సేకరించిన పరిశోధకులు అధ్యయనం చేయగా అన్నింటిలో ప్లాస్టిక్ ఆనవాళ్లు ఉన్నట్టు గుర్తించారు. 91 మెదడు నమూనాలను పరిశీలించగా ఇతర అవయవాల కంటే ఎక్కువ మైక్రోప్లాస్టిక్ ఉన్నట్టు న్యూ మెక్సికో యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు మాథ్యూ కాంపెన్ తెలిపారు. 24 మెదడు నమూనాల్లో అయితే మొత్తం బరువులో 0.5 శాతం వరకు ప్లాస్టిక్ ఉన్నట్టు చెప్పారు. డిమెన్షియా, అల్జీమర్స్ వంటి సమస్యలు ఉన్నవారి మెదళ్లలో ప్లాస్టిక్ ఎక్కువ ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు.