Fake Notes | ఢిల్లీ : దేశంలో నకిలీ నోట్ల చెలామణిపై కేంద్రం హెచ్చరికలు జారీచేసింది. రూ.500 దొంగ నోట్ల చెలామణిపై దర్యాప్తు సంస్థలను అలర్ట్ చేసింది. దొంగ నోట్లు అచ్చం అసలు నోట్ల లాగానే ఉన్నాయని తెలిపింది. వాటిని గుర్తించడం కూడా కష్టంగా మారిందని పేర్కొంది. నిఘా పెంచాలని సీబీఐ, ఎన్ఐఏ, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, సెబీ, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ లకు కేంద్రం ఆదేశాలు జారీచేసింది.
నకిలీ నోట్లు అచ్చం అసలైన నోట్ల లాగానే ఉన్నట్టు తెలుస్తున్నది. రెండింటి మధ్య చిన్నచిన్న వ్యత్యాసాలు మాత్రమే ఉన్నట్టు సమాచారం. నకిలీ నోట్లలో ‘RESERVE BANK OF INDIA’లోని ‘RESERVE’ అనే పదంలో ‘E’కి బదులు ‘A’ ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో నకిలీ నోట్లను గుర్తించేందుకు ప్రజలకు కేంద్రం, దర్యాప్తు సంస్థలు పలు సూచనలు ఇచ్చాయి. అందుకు ముఖ్యంగా ఐదు మార్గాలను సూచించాయి.