Mehbooba Mufti | అనంతనాగ్ నుంచి ముఫ్తీ పోటీ.. మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన పీడీపీ
Mehbooba Mufti | జమ్ముకశ్మీర్‌కు చెందిన మాజీ సీఎం, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. అనంత్‌నాగ్ నియోజకవర్గం నుంచి ఆమె బరిలోకి దిగుతున్నారు. కశ్మీర్ లోయలోని మూడు స్థానాలకు అభ్యర్థులను ఆ పార్టీ ఆదివారం ప్రకటించింది.
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌కు చెందిన మాజీ సీఎం, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ (Mehbooba Mufti) లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. అనంత్‌నాగ్ నియోజకవర్గం నుంచి ఆమె బరిలోకి దిగుతున్నారు. కశ్మీర్ లోయలోని మూడు స్థానాలకు అభ్యర్థులను ఆ పార్టీ ఆదివారం ప్రకటించింది. పీడీపీ యువజన విభాగం అధ్యక్షుడు వహీద్ పర్రా శ్రీనగర్ సీటు నుంచి, రాజ్యసభ మాజీ సభ్యుడు మీర్ ఫయాజ్ బారాముల్లా నుంచి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ, ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు చీఫ్ సర్తాజ్ మద్నీ కలిసి మీడియాకు ఈ విషయాన్ని తెలిపారు. జమ్మూ ప్రాంతంలోని రెండు స్థానాలైన ఉదంపూర్, జమ్మూలో కాంగ్రెస్ పార్టీకి పీడీపీ మద్దతు ఇస్తుందని అన్నారు.
కాగా, ‘ఇండియా’ బ్లాక్ నిర్ణయానికి వ్యతిరేకంగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తామని పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ ఇటీవల ప్రకటించారు. శ్రీనగర్ లోయలో పోటీ చేయనున్న నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ)పై ఆమెతోపాటు మరో ఇద్దరు అభ్యర్థులు బరిలో నిలిచారు. అయితే ముఫ్తీ నిర్ణయంపై ఎన్సీకి చెందిన ఒమర్ అబ్దుల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇండియా’ కూటమితో సీట్ల ఒప్పందంలో భాగంగా జమ్ములోని రెండు స్థానాలను కాంగ్రెస్ పార్టీకి వదిలేసినట్లు ఆయన చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Anantnag
- Announces
- Candidates
- fight
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

