Medicines | న్యూఢిల్లీ : దేశీయంగా 900 రకాలకు పైగా ఔషధాల ధరలు పెరిగినట్టు నేషనల్ ఫార్మాస్యుటికల్ ప్రైజింగ్ అథారిటీ ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచి కొత్త ధరలు అమలులోకి వచ్చాయి. ఇన్ఫెక్షన్లు, గుండె జబ్బులు, డయాబెటిస్ వంటి వ్యాధుల చికిత్స కోసం ఉపయోగించే ఔషధాలు, పెయిన్ కిల్లర్లు ధరలు 1.74 శాతం పెరిగాయి. టోకు ద్రవ్యోల్బణ సూచీ ఆధారంగా తయారీదారులు ప్రభుత్వం నుంచి ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా ఔషధాల ధరలను సవరించవచ్చు.