న్యూఢిల్లీ: అతడు ఢిల్లీలో పేరొందిన యూనివర్సిటీలో ఏంబీఏ చదివాడు. కానీ ఉద్యోగం దొరక్కపోవడంతో మత్తు పదార్థాలకు బానిసై వాటిని కొనడానికి కావాల్సిన డబ్బు కోసం దొంగతనాల బాట పట్టాడు. ఇప్పటివరకు ఏడు మొబైల్ ఫోన్లు, ఒక స్కూటర్ దొంగిలించి పోలీసుల కంట పడకుండా తప్పించుకు తిరిగాడు. అయితే ఒకే ప్రాంతంలో ఎక్కువగా దొంగతనాలు జరిగాయని ఫిర్యాదులు రావడంతో పోలీసులు మాటు వేసి, 300 సీసీ కెమెరాల దృశ్యాలను జల్లెడ పట్టి ఎట్టకేలకు గత నెల 20న అతడిని అరెస్ట్ చేశారు.
మంగళవారం పోలీసులు ఈ వివరాలను వెల్లడించారు. నిందితుడిని పాలం ప్రాంతానికి చెందిన ప్రదీప్ కుమార్ అలియాస్ రాహుల్‌గా గుర్తించారు. దొంగిలించిన ఫోన్లను అతడు తాను చోరీ చేసిన స్కూటర్లోనే దాచాడు.