Loksabha Elections 2024 : తమ రాజకీయ ప్రత్యర్ధులు విడుదల చేసే ఆకట్టుకునే ఎన్నికల మేనిఫెస్టోలను చూసి పార్టీ శ్రేణులు కలవరపాటుకు గురవాల్సిన అవసరం లేదని బీఎస్పీ చీఫ్, యూపీ మాజీ సీఎం మాయావతి అన్నారు. ఏ ఎన్నికల్లోనూ తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయదని అన్నారు. కేవలం మాటలు చెప్పడం కంటే పని చేయడానే బీఎస్పీ విశ్వసిస్తుందని అన్నారు. యూపీలోని మొరదాబాద్‌లో సోమవారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ మాయావతి ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇక కేంద్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటిస్తామని అంతకుముందు మాయావతి స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆదివారం ముజఫర్‌నగర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీ వేదికగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి ఆకాంక్షలకు అద్దం పడుతూ పశ్చిమ యూపీని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేస్తామని మాయావతి హామీ ఇచ్చారు.
బీఎస్పీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలు, కార్మికులు, రైతులు, చిరు వ్యాపారుల అవసరాలను గుర్తించి సేవలు అందించడంతో పాటు ఈ ప్రాంత అభివృద్ధికి చొరవ చూపుతుందని ఆమె పేర్కొన్నారు. మీరు కోరుకుంటే పశ్చిమ యూపీని ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటిస్తామని ఈ దిశగా తాము గట్టి చర్యలు చేపడతామని మాయావతి హామీ ఇచ్చారు. ఇక ముజఫర్‌నగర్ అభ్యర్ధిగా దారా సింగ్ ప్రజాపతిని బీఎస్పీ ఎన్నికల బరిలో నిలిపింది.
Read More :
Madhya Pradesh | కరెంట్ కట్‌చేయడానికి వెళ్తే కర్రలతో కొట్టారు..