బెంగళూరు, జూలై 14: భవిష్యత్తులో అంతరిక్షంలో చేపట్టబోయే నిర్మాణాల కోసం కావాల్సిన పదార్థాలను గ్రహశకలాల నుంచి సేకరించే అవకాశం ఉందని అంటున్నది బెంగళూరుకు చెందిన అంతరిక్ష రంగ స్టార్టప్ పిక్సెల్ స్పేస్. ఈ సంస్థ సీఈవో అవైస్ అహ్మెద్ తమ భవిష్యత్తు ప్రణాళికలను ‘పీటీఐ’కు వెల్లడించారు.
అంతరిక్షంలో నిర్మాణాల కోసం కావాల్సిన పదార్థాలను గుర్తించేందుకు చంద్రుడు, గ్రహశకలాలను మ్యాప్ చేయాలనే ఆలోచనలు ఉన్నట్టు తెలిపారు. భవన నిర్మాణ పదార్థాలు, ఇంధన వనరులను గ్రహశకలాల్లో అన్వేషించాలనే దీర్ఘకాలిక ప్రణాళిక ఉన్నట్టు చెప్పారు. భవిష్యత్తులో అంతరిక్షంపైకి మానవాళి విస్తరిస్తే.. కావాల్సిన పదార్థాలను భూమి నుంచి తీసుకెళ్లడం తెలివైన పని కాదని, అంతరిక్షంలో ఇంకా ఎక్కువ పదార్థాలు ఉన్నాయని తెలిపారు.