బడౌన్ (యూపీ), ఆగస్టు 12: ఒక ఎస్ఐ ఇంట్లో దోపిడీకి పాల్పడ్డ కొందరు దుండగులు, అడ్డువచ్చిన అతని తల్లి గొంతుకోసి హతమార్చి బంగారం, ఇతర వస్తువులతో పరారయ్యారు. ఈ ఘటన బీజేపీ పాలిత యూపీలోని ఫపూర్ జిల్లా ఇస్లామ్నగర్లోని మౌసంపూర్ గ్రామంలో చోటుచేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం 70 ఏండ్ల వృద్ధురాలైన ఎస్ఐ తల్లి సోమవారం రాత్రి ఒంటరిగా ఉండటాన్ని గమనించి ప్రవేశించిన దొంగలు.. అడ్డువచ్చిన ఆమె గొంతు కోసి హత్య చేశారు. తర్వాత ఆమె ఒంటిపై ఉన్న బంగారు గొలుసు, చెవిదుద్దులు, ఇంట్లోని ఖరీదైన వస్తువులను అపహరించి పరారయ్యారు.