న్యూఢిల్లీ: నోయిడాలోని పారిశ్రామిక వాడలో ఉన్న కార్మికులు జీతాలు పెంచాలంటూ ఆందోళన(Noida Protest) చేపట్టారు. ఆ ఆందోళన ఇవాళ హింసాత్మకంగా మారింది. కార్మికుల నిరసనతో కీలక ట్రాన్స్‌పోర్టు మార్గాలు స్తంభించిపోయాయి. జాతీయ రహదారి-9, నోయిడా మెట్రో కారిడార్ పూర్తిగా దిగ్బంధించారు. దీంతో వేలాది మంది ప్రయాణికులు ఎక్కడిక్కడ ఆగిపోయారు. 12 గంటల షిప్ట్ చేసినా కేవలం 9వేలు, 13 వేలు చెల్లిస్తున్నారని, ప్రస్తుతం ఉన్న ద్రవ్యోల్బణం దృష్ట్యా జీతాలను పెంచాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
మదర్సన్ గ్రూపు నేతృత్వంలో జరిగిన ఆందోళ మూడో రోజు హింసాత్మకంగా మారింది. వేతనాలను పెంచాలని కోరుతూ ఫేస్-1, సెక్టార్ 59 నుంచి 62 మధ్య కార్మికులు ఆందోళన చేపట్టారు. సమీప రోడ్లను, మెట్రో ఆపరేషన్స్ అన్నింటినీ నిరసనకారులు బ్లాక్ చేశారు. ఎన్‌హెచ్-9పై ప్రేవేటు వాహనాలు, బస్సులకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు.
ఓ పోలీసు వాహనాన్ని కిందపడేసి దానికి నిప్పు అంటించారు. నిరసన చేస్తున్న కార్మికులను చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు టియర్ గ్యాస్‌ను ప్రయోగించాయి. ప్రభావిత ప్రాంతాల్లో భద్రతను పెంచారు. కార్మిక చట్టాల ప్రకారం కార్మికులకు జీతాలు చెల్లించాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. కానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్న సంఘ వ్యతిరేక శక్తులను ఉపేక్షించవద్దు అన్నారు. ప్రస్తుతం ఢిల్లీ పోలీసులు కూడా హై అలర్ట్‌లో ఉన్నారు.
#WATCH | Uttar Pradesh: Vehicles and properties vandalised and stones pelted in Phase 2 of Noida where a large number of employees of a company gathered in protest over their demands for a salary increment. Heavy Police deployment made here to bring the situation under control.… pic.twitter.com/1B0axJZSBN
— ANI (@ANI) April 13, 2026