జైపూర్: రాజస్థాన్లోని సవాయ్ మాధోపూర్ జిల్లాలో భారీ వరదలు విధ్వంసం సృష్టించాయి. ఎడతెరిపి లేని వర్షాల వల్ల సుర్వాల్ డ్యామ్ ఉప్పొంగి ప్రవహించింది. దీనివల్ల ఆదివారం సుర్వాల్ గ్రామంలో దగ్గర్లో రెండు కిలోమీటర్ల మేర భారీ గుంత ఏర్పడి జలపాతం లాగా నీరు ప్రవహిస్తున్నది. వరదల వల్ల రహదారులన్నీ జలమయం అయ్యాయి.
సర్వాల్, ధనోలి, గొగర్, తదితర గ్రామాల్లోని ఇండ్లన్నీ నీట మునిగాయి. ప్రజలు మరో దారి లేక ఇండ్ల పై కప్పులపైకి చేరారు. ఆహారం, తాగునీరు లభించక ఇబ్బందులు పడ్డారు.