గువహటి : అసోం రాజధాని గువహటిలోని బసిస్టా ప్రాంతంలోని కారు షోరూంలో బుధవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. బెనెల్లి అండ్ ఇసుజు షోరూంలో ప్రమాదవశాత్తూ మంటలు ఎగిసిపడటంతో దాదాపు రూ . 5 కోట్ల నష్టం వాటిల్లింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
అగ్నిప్రమాదానికి కారణమేంటనే వివరాలు ఇంకా వెల్లడికాలేదు. రూ 1.5 కోట్ల విలువైన ఇసుజు కార్లు అగ్నికి ఆహుతవగా, రూ 6-7 లక్షల విలువైన బెనెల్లి బైక్స్ అగ్నిప్రమాదంలో దగ్ధమయ్యాయి. అగ్నిప్రమాదం కారణంగా తమకు మొత్తం రూ నాలుగైదు కోట్ల నష్టం వాటిల్లిందని షోరూం సేల్స్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ వెల్లడించారు.