గురుగ్రామ్: హర్యానాలోని గురుగ్రామ్‌లో (Gurugram) భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గురుగ్రామ్‌లోని జబల్పూర్ పారిశ్రామికవాడలో ఉన్న ఓ వాహనాల విడిభాగాలు తయారుచేసే పరిశ్రమలో శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. దీంతో క్రమంగా అవి ఫ్యాక్టరీ మొత్తానికి విస్తరించడంతో భారీ ఎత్తున అగ్నికీలలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 24 ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపుచేశారు. కాగా, ప్రమదానికి గల కారణాల ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.