Fire @ LPG Cylinder Shop | దేశ రాజధాని ఢిల్లీ నగరంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. శుక్రవారం ఢిల్లీలోని జాఫ్రాబాద్ ప్రాంతంలో ఎల్పీజీ సిలిండర్ షాప్లో పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురికి గాయాలయ్యాయి. మంటలు ఆర్పేందుకు అక్కడికి చేరుకున్న ఫైరింజన్సిబ్బందిలో ఐదుగురు గాయపడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు పౌరులు కూడా గాయపడ్డారు.
అగ్ని మాపక దళ సిబ్బంది మంటలను ఆర్పివేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.పౌర, పోలీసు ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.