జైపూర్: ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించాల్సిన ఒక భారీ రీఫైనరీ సోమవారం భారీ అగ్ని ప్రమాదానికి గురైంది. రాజస్థాన్‌లోని బలోత్రా జిల్లాలోని పచ్‌పద్రలో ఈ ఘటన సంభవించింది. ప్రమాదం కారణంగా ప్రధాని పర్యటన వాయిదా పడింది. ప్రమాదం జరిగిన రిఫైనరీ-కమ్-పెట్రో కెమికల్ కాంప్లెక్స్‌ను హెచ్‌పీసీఎల్, రాజస్థాన్ ప్రభుత్వం రూ.79,450 కోట్ల పెట్టుబడితో ఒక సంయుక్త సంస్థగా ఏర్పాటు చేశాయి. రీఫైనరీలోని ముడి చమురు శుద్ధి యూనిట్ సమీపంలో అగ్ని ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.