లక్నో: పెళ్లి విందు ఆలస్యంపై వరుడి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఇది ఘర్షణకు దారి తీసింది. (Massive Brawl) దీంతో కొట్టుకోవడంతోపాటు చైర్లు విసురుకున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గోవర్ధన్పూర్ గ్రామానికి చెందిన సబీర్ తన కుమార్తె పెళ్లి విందు ఏర్పాట్లలో బిజీ అయ్యాడు.
కాగా, వరుడికి చెందిన కొంతమంది యువకులు తమకు వెంటనే భోజనం వడ్డించాలని డిమాండ్ చేశారు. వారిని సముదాయించేందుకు సబీర్ ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు ఇది ఘర్షణకు దారి తీసింది. దీంతో వివాహ వాతావరణం గందరగోళంగా మారింది. ఒకరినొకరు కొట్టుకోవడంతోపాటు కుర్చీలు విసురుకున్నారు. ఈ గొడవలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే కొందరు వ్యక్తులు ఈ ఘర్షణను మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
🚨 बिजनौर: शादी में खाना लेट शुरू होने पर मारपीट 🚨
🍽️ शादी में भोजन की देरी के कारण हुई मारपीट
🎥 मारपीट का वीडियो सोशल मीडिया पर वायरल
👰🤵 दूल्हा और दुल्हन पक्ष के बीच हुई हिंसक झड़प
📍 अफजलगढ़ के गोवर्धनपुर गांव का मामला#Bijnor #WeddingFight #FoodDelay #ViralVideo… pic.twitter.com/OKhxAqTdTF— भारत समाचार | Bharat Samachar (@bstvlive) February 20, 2025