Mary Kom : భారత బాక్సింగ్ లెజెండ్ (Boxing legend) మేరీ కోమ్ (Mary Kom) ప్రస్తుతం తన భర్తకు దూరంగా ఉంటున్నారా..? త్వరలో వాళ్లిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారా..? మణిపూర్ (Manipur) అసెంబ్లీ ఎన్నికలు (Assembly elections) వారి మధ్య చిచ్చుపెట్టాయా..? అంటే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది. బాక్సర్ మేరీ కోమ్ తన భర్త నుంచి విడాకులు తీసుకోబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ మేరకు ఓ జాతీయ మీడియా సంస్థ కథనాన్ని ప్రచురించింది.
మీడియా కథనం ప్రకారం.. బాక్సర్ మేరీ కోమ్ 2005లో ఆంఖోలర్ అకా ఓన్లర్‌ను 2005లో వివాహం చేసుకుంది. వారికి నలుగురు పిల్లలున్నారు. వారిలో ముగ్గురు అబ్బాయిలు కాగా, ఒకరు అమ్మాయి. ఇన్నాళ్లు కలిసి ఉన్న ఈ కుటుంబం ఇప్పుడు విడిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. మేరీ కోమ్ తన నలుగురు పిల్లలను తీసుకుని ఫరీదాబాద్‌కు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఆమె భర్త అకా ఓన్లర్ తన తరఫు కుటుంబసభ్యులతో ఢిల్లీలోనే ఉన్నట్లు సమాచారం.
మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలే వారి మధ్య చిచ్చుపెట్టినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అకా ఓన్లర్ ఓడిపోయారు. ఎన్నికల ప్రచారం కోసం ఆయన ఏకంగా రెండు నుంచి మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. భారీగా ఖర్చుపెట్టి భర్త ఓడిపోవడంపై కోమ్ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఈ విషయంలోనే ఇద్దరి మధ్య వివాదం మొదలైందని, చివరికి మేరీ కోమ్ తన నలుగురు పిల్లలను తీసుకుని ఫరీదాబాద్‌కు వెళ్లిపోయిందని ప్రచారం జరుగుతోంది.
అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం అకా ఓన్లర్‌కు ఇష్టం లేదని, మేరీ కోమ్ బలవంతపెట్టి మీర ఆయనను బరిలో దింపిందని సదరు జాతీయ మీడియా సంస్థ పేర్కొంది. మేరీ కోమ్ కోసం, పిల్లల బాగోగులు చూసుకోవడం కోసం ఓన్లర్ తన ఫుట్‌బాల్ కెరీర్‌ను ఫణంగా పెట్టాడని, ఇప్పుడు కోమ్ అతడిని వదిలేసి దూరంగా ఉంటోందని ఓ బాక్సర్ చెప్పాడు. అంతేగాక కోమ్ మరో మహిళా బాక్సర్ భర్తతో చనువుగా ఉంటున్నట్టు కూడా పేరు చెప్పడానికి ఇష్టపడని ఆ బాక్సర్ తెలిపాడు.