కొచ్చి, నవంబర్ 21: నిత్యం ఆపరేషన్లు, రోగులు, చికిత్స, మందులు, ఇంజక్షన్లు వంటి మాటలు మాత్రమే వినిపించే దవాఖానలో పెండ్లి బాజాలు మోగాయి. ఎమర్జెన్సీ రూమే పెండ్లి మండపంగా మారింది. కేరళ, కొచ్చిలోని వీపీఎస్ లేక్షోర్ అనే ప్రైవేట్ హాస్పిటల్లో అవనీ, వీఎం షారోన్ల వివాహం డాక్టర్లు, నర్సులు, సిబ్బందితో పాటు కొద్దిపాటి బంధువుల సమక్షంలో శుక్రవారం జరిగింది.
అవనీ, షారోన్ల వివాహం శుక్రవారం మధ్యాహ్నం థంబోలిలో జరగాల్సి ఉంది. అయితే మేకప్ కోసం వెళ్లిన పెండ్లి కుమార్తె అవనీ వాహనం ప్రమాదానికి గురవ్వడంతో ఆమె గాయపడింది. దీంతో ఆమెను ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు.దీంతో దవాఖానలోనే అ పెండ్లి కుమార్తె మెడలో పెండ్లి కొడుకు మూడు ముళ్లు వేయడంతో వారి వివాహం జరిగిపోయింది.