Specially Abled Bride | దివ్యాంగ వధువును మోయిస్తూ రెండో అంతస్తుకు రప్పించిన వివాహ రిజిస్ట్రేషన్ అధికారి.. సస్పెండ్
Specially Abled Bride | దివ్యాంగురాలైన వధువును మోయిస్తూ బిల్డింగ్ రెండో అంతస్తుకు వివాహ రిజిస్ట్రేషన్ అధికారి రప్పించాడు. ఆ వధువు దీని గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో ఆ ప్రభుత్వ అధికారిని సస్పెండ్ చేశారు.
ముంబై: దివ్యాంగురాలైన వధువును మోయిస్తూ బిల్డింగ్ రెండో అంతస్తుకు వివాహ రిజిస్ట్రేషన్ అధికారి రప్పించాడు. ఆ వధువు దీని గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో ఆ ప్రభుత్వ అధికారిని సస్పెండ్ చేశారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. వీల్ చైర్‌కు పరిమితమైన దివ్యాంగురాలైన విరాలీ మోదీకి, క్షితిజ్ నాయక్‌తో ఈ నెల 16న పెళ్లి జరిగింది. దీని కోసం ముంబై ఖార్లోని వివాహ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వారు వెళ్లారు. అయితే వివాహ రిజిస్ట్రార్ కార్యాలయం రెండో అంతస్తులో ఉంది. అక్కడకు వెళ్లేందుకు లిఫ్ట్ లేకపోవడం, వధువు దివ్యాంగురాలు కావడంతో ఆమె సంతకాలు ఫార్మాల్టీస్ కోసం కిందకు రావాలని ఆ అధికారిని వారంతా వేడుకున్నారు. ఆయన నిరాకరించడంతో చివరకు దివ్యాంగురాలైన వధువును రెండో అంతస్తు వరకు మోసుకెళ్లాల్సి వచ్చింది.
కాగా, తాను ఎదుర్కొన్న వివక్షపై వధువు విరాలీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. రెండో అంతస్తుకు వెళ్లేందుకు ఎలాంటి లిఫ్ట్ సౌకర్యం లేనట్లు తెలిపింది. అయినప్పటికీ ఫార్మాలిటీలను పూర్తి చేయడానికి సంబంధిత అధికారి కిందకు దిగి రావడానికి నిరాకరించారని ఆరోపించింది. ‘ఇది న్యాయమా? యాక్సెసిబుల్ ఇండియా ప్రచారం ఏమైంది? వీల్‌చైర్ వినియోగించే దివ్యాంగురాలైన నేను ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకునే హక్కు లేదా? పెళ్లి రోజున రెండో అంతస్తు వరకు నన్ను మోసుకెళ్లినప్పుడు నేను లేదా మోసే వ్యక్తి జారిపడి ఏదైనా జరిగి ఉంటే దానికి బాధ్యులెవరు?’ అని ఆమె ప్రశ్నించింది.
మరోవైపు వధువు విరాలీ ఆవేదన పూరిత పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ దీనిపై స్పందించారు. సంబంధిత అధికారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ నేపథ్యంలో సంబంధిత వివాహ నమోదు నిబంధనలు పాటించనందుకు వివాహ అధికారి అరుణ్ ఘోడేకర్ను సస్పెండ్ చేశారు. మహారాష్ట్ర రెవెన్యూ శాఖ ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
PLEASE RT!
I am disabled and I got married at the Registrars Office at Khar Mumbai on 16/10/23. The office was on the 2nd floor WITHOUT a lift. They wouldn’t come downstairs for the signatures and I had to be carried up two flights of stairs to get married. pic.twitter.com/ZNCQF3gJRY
— Virali Modi (@Virali01) October 18, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

