న్యూఢిల్లీ, జూలై 25: ఢిల్లీ ట్యాక్సీ, పర్యాటక, టూర్ ఆపరేటర్ల సంఘం ఇథనాల్ కలిపిన పెట్రోల్ అమలుకు వ్యతిరేకంగా ఆగస్టు 4న పార్లమెంట్‌కు పాదయాత్ర చేపడుతున్నట్టు శనివారం ప్రకటించింది. ఈ సందర్భంగా ట్రాన్స్పోర్టర్స్ సంఘం అధ్యక్షుడు సంజయ్ సామ్రాట్ మాట్లాడుతూ, ‘ఇథనాల్ 20 విధానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన రవాణా నిర్వాహకులు, వాహన యజమానులు ఇంధన సామర్థ్యం తగ్గడం, నిర్వహణ ఖర్చులు పెరుగటం, ఇంజిన్ పనితీరుపై ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం ఇంధన ధరను పెంచుతుంటే, ప్రజలు పెట్రోల్ కోసం డబ్బు చెల్లిస్తున్నప్పుడు, మనకు ఈ మిశ్రమ పెట్రోల్ ఎందుకు లభిస్తున్నది?’ అని ఆయన అన్నారు.