థాణె: మహారాష్ట్రలో భాషా వివాదం ముదురుతున్నది. మరాఠీ మాట్లాడేందుకు నిరాకరించిన ఓ దుకాణదారుడిపై దాడి జరిగిన దరిమిలా రాజకీయ వేడి రాజుకున్న నేపథ్యంలో మరాఠీ అస్మిత(ఆత్మగౌరవం) నినాదంతో రాజ్ ఠాక్రే సారథ్యంలోని ఎంఎన్‌ఎస్‌తోపాటు, ఇతర మరాఠీ గ్రూపులు మంగళవారం ముంబై సమీపంలోని మీరా భయందర్‌లో భారీ నిరసన ప్రదర్శన చేపట్టాయి.
శివసేన (యూబీటీ), ఎన్సీపీ (శరద్ పవార్) కూడా నిరసనలో చేరడంతో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. నిరసనకు సంఘీభావం తెలిపేందుకు అక్కడకు వచ్చిన శివసేన మంత్రి ప్రతాప్ సర్నాయక్‌ను ఘెరావ్ చేసిన కార్యకర్తలు అక్కడి నుంచి తరిమివేశారు.