జాల్నా: మరాఠాలకు రిజర్వేషన్లు ఇవ్వాలని మరాఠాల నాయకుడు మనోజ్ జరాంగే చేస్తున్న నిరాహార దీక్ష బుధవారం ఐదో రోజుకు చేరుకుంది. ఆయన ఆరోగ్యం క్షీణిస్తుండటంతో రాష్ట్ర మంత్రి ఒకరు చర్చలు జరిపి సమస్యను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మంత్రి హామీ మేరకు తాను ఐవీ ఫ్లూయిడ్స్ తీసుకుంటున్నట్టు మనోజ్ జరాంగే తెలిపారు.
ఒకవేళ సమస్య పరిష్కరించకపోతే ఐవీ ఫ్లూయిడ్స్ తీసుకోవడం మళ్లీ ఆపేస్తానని ఆయన హెచ్చరించారు. తనకు హామీ ఇచ్చిన మంత్రి ఎవరనేది కూడా అప్పుడే బయటపెడతానని అన్నారు. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే అసెంబ్లీ ఎన్నికల్లో 288 స్థానాలకూ అభ్యర్థులను బరిలో నిలుపుతామని మనోజ్ పేర్కొన్నారు.