బీజాపూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో మావోయిస్టులు దారుణానికి ఒడిగట్టారు. పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో ఓ వ్యక్తిని హత్యచేశారు. శనివారం రాత్రి బీజాపూర్‌లోని తిమ్మాపూర్పై దాడిచేసిన మావోయిస్టులు హేమంత బేడి అనే యువకుడిని ఎత్తుకెళ్లారు. గ్రామ శివార్లలో అతని గొంతుకోసి హత్యకు పాల్పడ్డారు. అతడు మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని గ్రామస్తులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.