కొత్తగూడెం ప్రగతి మైదాన్, ఫిబ్రవరి 4: పోలీస్ ఇన్ఫార్మర్లనే నెపం తో మావోయిస్టులు ఇద్దరు గ్రామస్తులను హత్య చేసినట్లు తెలుస్తున్నది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా బాసగూడ పోలీస్స్టేషన్ పరిధిలోని బుడ్గి గ్రామానికి చెందిన రాజు కరం, మున్న మాద్విపై ఇన్ఫార్మర్ల ముద్రవేసి హత్య చేసినట్లు పోలీసు వర్గాల ద్వారా తెలిసింది.
మరోవైపు, భద్రతా బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి. ఈ ఘటన బీజాపూర్ జిల్లాలో మంగళవారం చోటు చేసుకుంది. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.