కొత్తగూడెం ప్రగతి మైదాన్ : ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న మావోయిస్టులు.. లొంగిపోయిన వారి కుటుంబాలకు చెందిన ముగ్గురిని హతమార్చారు. ఈ ఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మంగళవారం చోటు చేసుకుంది. బీజాపూర్ జిల్లా పెద్దకొర్మ గ్రామానికి చెందిన జింగు మొడియం, సోమ మొడియం, అనిల్ మడివి అనే ముగ్గురు గ్రామస్తులను మావోయిస్టులు ప్రజా కోర్టు నిర్వహించి ఉరి వేసి హత్య చేసినట్లు తెలుస్తోంది.
హత్యకు గురైన వారిలో ఇటీవల లొంగిపోయిన మావోయిస్టులు దినేశ్ మొడియం బంధువులుగా గ్రామస్తులు పేర్కొంటున్నారు. అంతేకాక మరో ఏడుగురు గ్రామస్తులను మావోయిస్టులు అపహరించి తీసుకెళ్లినట్లు సమాచారం.