Chhattisgarh | రాయ్పూర్ : ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు మెరుపు దాడి చేశారు. బీజాపూర్ జిల్లా గంగలూర్ పరిధి హీరేలిలో పోలీసుల శిబిరంపై రాకెట్ లాంఛర్లతో మావోయిస్టులు దాడికి పాల్పడ్డారు. మావోయిస్టుల దాడితో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో మావోయిస్టులు, పోలీసుల మధ్య కాసేపు ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసుల కాల్పులు జరపడంతో మావోయిస్టులు పరారీ అయ్యారు. పోలీసుల శిబిరంపై మావోయిస్టుల దాడిని బీజాపూర్ ఎస్పీ ఆంజనేయ వర్షనేయ ధృవీకరించారు.