మీరట్: ఎంబీబీఎస్ సీట్లు పొందేందుకు పలువురు అభ్యర్థులు అడ్డదారులు తొక్కారు. ఎలాగైనా సీట్లు సంపాదించాలన్న లక్ష్యంతో ఏకంగా మతాన్నే అడ్డగోలుగా మార్చుకున్నారు. యూపీలో మైనారిటీ కాలేజీల్లో సీట్లు పొందేందుకు 12 మందికిపైగా అభ్యర్థులు మతం మారినట్టు అధికారుల దర్యాప్తులో తేలింది. వీరందరూ మతమార్పిడి చట్టం 2021ని ఉల్లంఘించినట్టు అధికారులు గుర్తించారు. ఇలా వెలుగులోకి వచ్చిన 20 అడ్మిషన్లను అధికారులు స్క్రూటినీ చేస్తున్నారు. అభ్యర్థులు సమర్పించిన సర్టిఫికెట్లపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆదేశించింది. అలాగే, ఉత్తరప్రదేశ్ హోం మంత్రిత్వశాఖకు ఈ విషయాన్ని తెలియజేసింది. మొత్తం 20 మంది అభ్యర్థుల్లో ఏడుగురి అడ్మిషన్లను రద్దు చేయగా, మరో ఏడుగురు స్వచ్ఛందంగా దరఖాస్తులను వెనక్కి తీసుకున్నారు.