న్యూఢిల్లీ: వందేమాతరం 150వ వార్షికోత్సవాలను పురస్కరించుకుని ఆ గేయంపై పార్లమెంట్లో ఇవాళ చర్చ చేపట్టారు. లోక్సభలో ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ వందేమాతర మంత్రం స్వాతంత్ర్య సమరోత్సాహ సమయంలో యావత్ దేశ ప్రజలకు శక్తిని, ప్రేరణను ఇచ్చిందన్నారు. వందేమాతరంకు 50 ఏళ్లు నిండిన సమయంలో దేశంలో అప్పుడు బ్రిటీషు పాలనలో ఉందని, ఇక వందేళ్లు నిండిన సమయంలో అప్పుడు దేశంలో ఎమర్జెన్సీ ఉందని ప్రధాని పేర్కొన్నారు. ఇవాళ మనం ఇక్కడ కూర్చున్నామంటే, లక్షలాది మంది వందేమాతం ఆలపించడం వల్లే అని, వాళ్లుంతా స్వాతంత్య్రం కోసం పోరాడారని తెలిపారు. పవిత్రమైన వందేమాతరం గీతాన్ని గుర్తు చేసుకోవడంతో ఈ సభలో ఉన్న ప్రతి ఒక్కరి గొప్ప అవకాశంగా భావించాలన్నారు. బ్రిటీష్ పాలకులు గాడ్ సేవ్ ద క్వీన్ అన్న గీతాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్తున్న సమయంలో వందేమాతరం గీతాన్ని రాసినట్లు ప్రధాని మోదీ తెలిపారు. వందేమాతరం కేవలం రాజకీయ స్వేచ్ఛా మంత్రం కాదు అని, బ్రిటీష్ పాలకుల ఆధీనం నుంచి భరతమాత స్వేచ్ఛ కోసం జరిగిన పవిత్ర యుద్ధం అన్నారు.
#WATCH | PM Narendra Modi says, “… When Vande Mataram completed 50 years, India was under British rule. When Vande Mataram completed 100 years, India was in the clutches of Emergency… At that time, the patriots were imprisoned. When the song that inspired our freedom… pic.twitter.com/Kww4ewc6wM
— ANI (@ANI) December 8, 2025