న్యూఢిల్లీ: కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ల ముసాయిదా నిబంధనలు త్వరలోనే ప్రీ-పబ్లిష్ అవుతాయని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ బుధవారం చెప్పారు. వాటిని పూర్తి స్థాయిలో అమలు చేయడం వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27) నుంచి ప్రారంభమవుతుందన్నారు.
వేతనాల స్మృతి, 2019; పారిశ్రామిక సంబంధాల స్మృతి, 2020; సాంఘిక భద్రత స్మృతి, 2020; వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల స్మృతి, 2020లను కేంద్ర ప్రభుత్వం నవంబర్ 21న నోటిఫై చేసింది.