న్యూఢిల్లీ : బారాత్‌లో ఓ వ్యక్తి వినూత్న స్టెప్పులతో అదరగొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అన్ష్ పరాశర్ అనే యూజర్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు. ఈ వీడియోలో మద్యం సేవించడాన్ని మైమ్ తరహాలో ఓ వ్యక్తి ప్రదర్శించడం ఆకట్టుకుంటోంది. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకూ 30 లక్షల మందికి పైగా వీక్షించారు.
మద్యాన్ని గ్లాసులో పోయడం నుంచి స్నాక్స్‌తో కలిపి తీసుకోవడం వరకూ ప్రతి దశనూ బారాత్‌లో డ్యాన్స్ చేస్తూ ప్రదర్శించడం ఈ క్లిప్‌లో కనిపిస్తుంది. బ్యాండ్ బృందం కూడా అతడికి సహకరించడం ఆకట్టుకుంటుంది. బారాత్‌లో వ్యక్తి మూమెంట్స్ అద్భుతంగా ఉన్నాయని నెటిజన్లు కితాబిచ్చారు. ఒక్క పదం కూడా చెప్పకుండా మొత్తం ప్రక్రియను వివరించాడని ఓ యూజర్ కామెంట్ చేయగా, మీ హృదయం ఏం కోరుకుంటోందో వెల్లడించేందుకు మీకు పదాలతో పనిలేదని మరో యూజర్ రాసుకొచ్చారు.