చెన్నై: ఆలయంలోని హుండీలో ఒక వ్యక్తి కానుకలు వేశాడు. అయితే అతడి చేతిలోని ఐఫోన్ పొరపాటున హుండీలో పడింది. కంగారు పడిన ఆ వ్యక్తి ఈ విషయాన్ని ఆలయ అధికారులకు చెప్పాడు. తన ఐఫోన్ తిరిగి ఇవ్వాలని కోరాడు. (iPhone falls into Hundi) అయితే హుండీలోకి చేరినవన్నీ దేవుడికి చెందుతాయని, దేవుడి ఆస్తిగా పరిగణిస్తామని ఆలయ అధికారులు పేర్కొన్నారు. తమిళనాడులోని తిరుపోరూర్‌లో ఈ సంఘటన జరిగింది. దినేశ్ అనే భక్తుడు అక్కడి కందస్వామి ఆలయాన్ని దర్శించాడు. ఆ గుడిలోని హుండీలో డబ్బులు వేస్తుండగా అతడి చేతిలోని ఐఫోన్ జారి అందులో పడింది.
కాగా, ఆందోళన చెందిన దినేశ్, ఆలయ అధికారులను సంప్రదించాడు. పొరపాటున దేవుడి హుండీలో తన ఐఫోన్ పడిన విషయం చెప్పాడు. దానిని తిరిగి ఇవ్వాలని కోరాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆలయ అధికారులు ఆ హుండీని తెరిచారు. అందులో ఐఫోన్ ఉన్నట్లు గుర్తించారు. దినేశ్‌కు ఈ విషయం తెలిపారు. అయితే హుండీలో పడిన ఆ ఐఫోన్ దేవుడి ఆస్తి అవుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో దానిని తిరిగి ఇవ్వలేమని అన్నారు. కానీ ఐఫోన్‌లోని డేటాను తీసుకునేందుకు అనుమతిస్తామని వెల్లడించారు. అయితే తన ఐఫోన్ తనకు తిరిగి ఇవ్వాలని దినేశ్ పట్టుబట్టాడు.
మరోవైపు ఆ రాష్ట్ర మంత్రి పీకే శేఖర్‌బాబు దృష్టికి ఇది వెళ్లింది. ఆయన కూడా ఆలయ అధికారుల నిర్ణయాన్ని సమర్థించారు. ‘దేవుడి హుండీలో జమ అయినది ఏదైనా, పొరపాటుగా జరిగినప్పటికీ అది దేవుడి ఖాతాలోకి వెళ్తుంది. భక్తులకు తిరిగి ఇచ్చేందుకు నిబంధనలు అంగీకరించవు’ అని అన్నారు. అయితే ఆ శాఖ అధికారులతో చర్చిస్తానని, ఆ భక్తుడికి నష్టపరిహారం అందించే అంశాన్ని పరిశీలిస్తామని ఆయన తెలిపారు.
iPhone accidentally fell into the temple’s hundi..
The temple administration refused to return it the owner, saying it belonged to the temple.pic.twitter.com/4VgfcRk0Ib
— Vije (@vijeshetty) December 20, 2024