ముంబై: బైక్పై వెళ్తున్న వ్యక్తి బస్సును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అతడి చేయి బస్సు చక్రాల కింద పడి నలగడంతోపాటు తెగిపోయింది. (Man’s Hand Severed) ఇది చూసి అక్కడున్న జనం షాక్ అయ్యారు. ఆ వ్యక్తిని వెంటనే హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం ఉదయం 9.30 గంటల సమయంలో ఒక వ్యక్తి బైక్పై వెళ్తున్నాడు. అంధేరిలోని బైలేన్ నుంచి సడన్గా మెయిన్ రోడ్డులోకి ప్రవేశించాడు. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) నడిపే బస్సును అతడు ఢీకొట్టాడు.
కాగా, ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి ఎడమ చేయి బస్సు వెనుక చక్రం కింద పడింది. అది నలిగిపోవడంతో పాటు తెగిపోయింది. అక్కడున్న వారు ఇది చూసి షాక్ అయ్యారు. 35 ఏళ్ల ఇస్మాయిల్ సూరత్వాలాగా గుర్తించిన అతడ్ని వెంటనే హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. బీఎంసీ బస్సును స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.