కురుక్షేత్ర: హర్యానాలోని కురక్షేత్రలో సోమవారం గుర్తు తెలియని వ్యక్తులు ఓ వ్యక్తి పై దాడి చేసి అతని చేతిని నరికివేశారు. జుగ్ను అనే వ్యక్తిని లోక్ నాయక్ జయ ప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రిలో చేర్పించారు. సర్దార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై విచారణ చేపడుతున్నారు. నిందితుల్ని గుర్తించేందుకు పోలీసులు సీసీటీవీ ఫూటేజ్‌ను పరిశీలిస్తున్నారు.
పది మంది వ్యక్తులు తమ ముఖాలకు మాస్క్ పెట్టుకుని, బాధితుడు జుగ్నును అటాక్ చేశారని, అతని చేయిని నరుక్కుని వెళ్లారని, అయితే ఈ ఘటనకు చెందిన సరైన కారణం తెలియదని డీఎస్పీ రామ్‌దత్ తెలిపారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసును బుక్ చేశారు. కురుక్షేత్ర హవేలీ వద్ద ఉన్న వ్యక్తిని 12 మంది పదునైన ఆయుధాలతో అటాక్ చేసినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు.