రాంచీ: ప్రభుత్వ స్కూల్లోని క్లాస్‌రూమ్‌లో రక్తంతో తడిసి ఉన్న యువకుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. (Man’s Body In Classroom) కలకలం రేపిన ఈ సంఘటన ఆ ప్రాంతంలో ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జార్ఖండ్‌లోని జంషెడ్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం ఉదయం ఉలిదిమ్లోని ప్రభుత్వ పాఠశాల రెండవ అంతస్తులోని తరగతి గదిలో రక్తంతో తడిసిన స్థానిక వ్యక్తి మృతదేహం కనిపించింది. గొంతు కోసి అతడ్ని హత్య చేసినట్లుగా ఉండటంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
కాగా, ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ స్కూల్ వద్దకు చేరుకున్నారు. మృతుడ్ని 24 ఏళ్ల సౌరభ్ శర్మగా గుర్తించారు. పోస్ట్‌మార్టం కోసం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే గురువారం రాత్రి నుంచి తమ కుమారుడు కనిపించలేదని అతడి తల్లిదండ్రులు తెలిపారు. చివరిసారిగా రాత్రి 9 గంటలకు ఫోన్ చేశాడని, ఆ తర్వాత మొబైల్ ఫోన్ స్విచ్చాఫ్ వచ్చిందని పోలీసులకు చెప్పారు.
మరోవైపు సౌరభ్ చివరిసారి తన బంధువైన రాజుతో వీడియో కాల్ మాట్లాడినట్లు పోలీసులు తెలుసుకున్నారు. దీంతో రాజును ప్రశ్నించారు. అలాగే సౌరభ్ డ్రగ్స్‌కు బానిసగా గుర్తించారు. ఈ నేపథ్యంలో అతడికి ఎవరితోనైనా శతృత్వం ఉన్నదా? మూసి ఉన్న స్కూల్ బిల్డింగ్‌లోకి ఎలా ప్రవేశించాడు? అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.