ముంబై : లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) విపక్ష ఇండియా కూటమి నుంచి పోటీ చేస్తారని వచ్చిన వార్తలపై నటుడు మనోజ్ బాజ్‌పేయ్ స్పందించారు. బిహార్‌కు చెందిన మనోజ్ బాజ్‌పేయ్ వెస్ట్ చంపరన్ నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలో నిలుస్తారని ప్రచారం సాగింది. ప్రస్తుతం ఈ స్ధానం నుంచి బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తోంది.
త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని వస్తున్న వార్తలను మనోజ్ బాజ్‌పాయ్ తోసిపుచ్చారు. తాను ఎన్నికల బరిలో నిలుస్తానని ఎవరు చెప్పారో చెప్పండి..గత రాత్రి ఇలా మీరు కల కన్నారా..? చెప్పండి అంటూ ఫ్యామిలీ మ్యాన్ నటుడు నిలదీశారు. తాను ఎన్నడూ రాజకీయాల్లో అడుగుపెట్టేది లేదని స్పష్టం చేశారు.
తాను ఇటీవల బిహార్ వెళ్లినప్పుడు ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్, ఆయన కుమారుడు బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌ను కలిశానని, అప్పటినుంచి తాను రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తానని ప్రచారం సాగుతోందని మనోజ్ బాజ్‌పాయ్ పేర్కొన్నారు. తాను పాలిటిక్స్‌లో చేరేది లేదని ఇది 200 శాతం వాస్తవమని స్పష్టం చేశారు. తాను నటుడినని, నటుడిగానే ఉంటానని రాజకీయాల్లో తన చేరిక గురించిన ప్రశ్న ఎలా తలెత్తిందని ప్రశ్నించారు.
Read More :