PM Modi | ప్రధాని నరేంద్ర మోదీ నెలవారీ రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో పెరుగుతున్న టెక్స్టైల్ వ్యర్థాల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. టెక్స్టైల్ రంగంలో భారత్ పెద్ద సవాల్‌ను ఎదుర్కొంటుందన్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి జరుగుతున్న ప్రయత్నాలను అభినందించాలని పిలుపునిచ్చారు. తాను అందరికీ సంబంధించిన ఓ సవాల్ గురించి చెప్పాలనుకుంటున్నానని.. ఇది టెక్స్టైల్ వ్యర్థాల గురించే. టెక్స్‌టెల్ వేస్ట్ అంటే ఏంటో? అని మీరు ఆలోచిస్తూ ఉండొచ్చని.. ఇది టెక్స్టైల్ వేస్ట్ ప్రపంచానికి పెద్ద సవాల్‌గా మారుతోందన్నారు. ప్రస్తుత కాలంలో పాత దస్తులను పడేసి కొత్తవి కొను అలవాటు పెరిగిందన్నారు. మనం పక్కన పడేసే పాత దుస్తులు ఏమవుతాయో ఎప్పుడైనా ఆలోచించారా? అంటూ ప్రశ్నించారు.
ఈ బట్టలన్నీ చెత్తగా మారుతున్నాయన్నారు. ఈ విషయంలో పరిశోధనలు జరుగుతున్నాయని.. అయితే, ఒక స్టడీలో కేవలం ఒకశాతం కంటే తక్కువ మాత్రమే టెక్స్టైల్ వేస్టే కొత్త బట్టలుగా మారుతున్నారని తేలిందన్నారు. ప్రపంచంలోనే భారతదేశం మూడవ అతిపెద్ద దేశమని.. ఇక్కడ ఎక్కువ టెక్స్టైల్ వ్యర్థాలు కూడా ఎక్కువగానే ఉత్పత్తి అవుతున్నాయన్నారు. ఇది పెద్ద సవాల్ అని.. కానీ, సవాల్‌ను ఎదుర్కొనేందుకు భారత్‌లో అనేక ప్రశంసనీయమైన ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. అనేక భారతీయ స్టార్టప్‌లు వస్త్రాలను రీసైకిల్ చేసేందుకు కృషి చేస్తున్నాయని.. చాలామంది యువకులు సస్టెయినబుల్ ఫ్యాషన్ ప్రయత్నాలతో కనెక్ట్ అయ్యారన్నారు. వారంతా పాత బట్టలు, చెప్పుల్ని రీసైకిల్ చేసి అవసరమైన వాళ్లకు అందిస్తున్నారన్నారు. టెక్స్టైల్ వేస్ట్ నుంచి డెకరేషన్ వస్తువులు, హ్యాండ్‌బ్యాగ్‌లు, స్టేషనరీ, బొమ్మలు లాంటి వస్తువులు తయారు చేస్తున్నారని.. చాలా సంస్థలు ఇప్పుడు సర్క్యులర్ ఫ్యాషన్ బ్రాండ్‌ను పాపులర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయన్నారు.
దాంతో పాటు కొన్ని వేదికలపై దుస్తులను అద్దెకు తీసుకుంటున్నారని.. కొన్ని సంస్థలు పాత దుస్తులను సేకరించి.. వాటికి కొత్త రూపాన్ని ఇచ్చి పేదలకు పంపిణీ చేస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా పానిపట్, తిరువూర్, బెంగళూరు వంటి నగరాలు టెక్స్టైల్ వ్యర్థాల నిర్వహణలో కొత్త పద్ధతులను అవలంభిస్తున్నాయన్నారు. పానిపట్ ఇప్పుడు వస్త్ర రీసైక్లింగ్‌కు ప్రపంచ కేంద్రంగా మారుతోందని, బెంగళూరులో ఈ రంగంలో అనేక వినూత్న సాంకేతిక సొల్యూషన్స్ వస్తున్నాయన్నారు. తిరుపూర్‌లో టెక్స్టైల్ వ్యర్థాల నిర్వహణ కోసం నీటి శుద్ధి, పునరుత్పాదక శక్తిని ఉపయోగిస్తున్నారన్నారు. ఈ ప్రయత్నాలను స్ఫూర్తిదాయకంగా అభివర్ణించిన ప్రధానమంత్రి, అందరూ ఈ దిశలో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.